మా ఇద్దరి మధ్య రిలేషన్ అదే!

By udayam on August 18th / 10:20 am IST

నటి ఛార్మితో తనకున్న రిలేషన్‌ షిప్‌ను బయటపెట్టారు పూరి జగన్నాథ్‌. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఛార్మీ 13 ఏళ్ల వయసప్పటి నుండి తనకు తెలుసని, దశాబ్దాలుగా ఆమెతో కలిసి పనిచేస్తున్నానని తెలిపారు. ఛార్మీకి నాకు ఏదో అఫైర్‌ ఉందని ఏదేదో మాట్లాడుకుంటారు. ఆమె ఇంకా యంగ్‌గా ఉండటం వల్లే ఇలాంటి రూమర్స్‌ వస్తున్నాయి. అదే అదే ఛార్మికి 50ఏళ్లు ఉంటే ఇలా మాట్లాడేవారు కాదు. ఆమెకు వేరేవాళ్లతో పెళ్లి జరిగినా పట్టించుకునేవారు కాదు అని చెప్పుకొచ్చాడు. చాలా కాలంగా వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోంది అంటూ టాలీవుడ్ లో చాలా రూమెర్స్ వచ్చాయి.

ట్యాగ్స్​