అల్లు అర్జున్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పుష్ప మూవీకి కొనసాగింపుగా రానున్న పుష్ప 2 మూవీ షూటింగ్ వాయిదా పడనుందని తెలుస్తోంది. ఈ సెకండ్ పార్ట్ కోసం స్క్రిప్ట్ వర్క్ ఇంకా పూర్తి కాని నేపధ్యంలో షూటింగ్‌ను కొన్ని నెలల పాటు వాయిదా వేయాలని బన్నీ, డైరెక్టర్ సుకుమార్‌లు భావిస్తున్నారు. స్క్రిప్ట్ విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని భావించడంతోనే ఈ గ్యాప్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. దీంతో అల్లు అర్జున్ తన తర్వాతి చిత్రాన్ని బోయపాటి శ్రీనుతో చేయనున్నాడని ప్రచారం జరుగుతోంది.