అక్షయ్​: అల్లు అర్జున్​తో కలిసి నటిస్తున్నా

By udayam on June 2nd / 1:30 pm IST

టాలీవుడ్​ నటుడు అల్లు అర్జున్​తో కలిసి ఓ సినిమా చేస్తున్నానని బాలీవుడ్​ అగ్ర నటుడు అక్షయ్​ కుమార్​ వెల్లడించాడు. బన్నీతో పాటు మరో సౌత్​ ఇండియా నటుడి సినిమాలోనూ తాను కనిపించనున్నానని చెప్పిన అక్షయ్​.. ఈ విషయంలో సౌత్​, నార్త్​ అనే తేడాలు ఉండకూడదన్నాడు. మనదంతా ఒకటే సినీ ఇండస్ట్రీ అని చెప్పిన అక్షయ్​ అన్ని పరిశ్రమల వారూ కలిసి నటించే సమయం వచ్చిందన్నాడు. అతడి తాజా చిత్రం సమ్రాట్​ పృధ్విరాజ్​ ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్షయ్​ ఈ వ్యాఖ్యలు చేశాడు.

ట్యాగ్స్​