నేపాల్​ మూడోసారి ప్రధానిగా ప్రచండ

By udayam on December 26th / 9:01 am IST

నేపాల్ నూతన ప్రధానిగా సీపీఎన్-మావోయిస్ట్ సెంటర్ చైర్మన్ పుష్ప కమాల్ దహాల్ ప్రచండను ఆ దేశ రాష్ట్రపతి బిద్యాదేవి భండారి నియమించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 76 క్లాజ్ 2 ప్రకారం ప్రచండను ప్రధానిగా నియమించినట్లు అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. దీంతో ప్రచండ ఈరోజు సాయంత్రం 5.30 గంటలకు ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. 275 మంది సభ్యులున్న నేపాల్ ప్రతినిధుల సభలో ప్రచండకు 165 మంది సభ్యుల మద్దతు ఉంది. ఆయన ప్రధాని బాధ్యతలు చేపట్టడం ఇది మూడోసారి.

ట్యాగ్స్​