రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై హత్యాయత్నం విఫలమైందని ఉక్రెయిన్ మిలటరీ అధికారులు వెల్లడించారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభానికి 2 నెలల ముందు తాము ఈ ప్రయత్నం చేసి విఫలమైనట్లు ఉక్రెయిన్ రక్షణ శాఖ చీఫ్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ కైరైలో బుడనోవ్ వెల్లడించారు. ఉక్రైన్స్కా ప్రావ్డా కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్న బయటపెట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరి 24న కాకాకస్ ప్రాంతంలో పుతిన్‌పై ఈ హత్యాయత్నాన్ని ప్లాన్ చేసినట్లు తెలిపారు.