అంతర్జాతీయ వేదికపై పుతిన్​ కు ఘోర అవమానం

By udayam on November 25th / 6:27 am IST

అంతర్జాతీయ వేదికపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​ కు ఘోర అవమానం జరిగింది.రష్యా మద్దతుతో ఏర్పాటైన కలెక్టివ్​ సెక్యూరిటీ ట్రీటీ (సి.ఎస్​.టి.ఓ) సదస్సు ప్రారంభోత్సవం సందర్భంగా సభ్య దేశాలు పుతిన్​ పక్కన నిలబడి ఫొటో దిగడానికి వెనుకాడాయి. దీంతో అతడికి దూరంగా ఉంటూ ఆయా దేశాల అధ్యక్షులు ఫొటోలకు పోజులిచ్చారు. అర్మేనియా ప్రధాని అయితే మరో మెట్టు ఎక్కి.. పుతిన్​ కు కరచాలనం ఇవ్వడం కానీ.. కలిసి విడుదల చేయాలని డాక్యుమెంట్లపై సంతకాలు చేయడం కానీ చేయలేదు. ఈ గ్రూపులోని సభ్య దేశాలన్నీ రష్యాకు అత్యంత ఆప్తమిత్రులుగా గుర్తింబడ్డవే కావడం గమనార్హం.

ట్యాగ్స్​