కొవిడ్ ముందున్న రోజులు తిరిగి వచ్చిన తరుణంలో ఆస్ట్రేలియా దిగ్గజ ఎయిర్‌లైన్స్ ఖాంతాస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్బోర్న్ నగరాల నుంచి సుదూర ప్రాంతాలకు నాన్‌స్టాప్ ఫ్లైట్లను నడపాలని నిర్ణయం తీసుకుంది. ఈ ఫ్లైట్లు న్యూయార్క్, లండన్, ఫ్రాంక్ఫర్ట్, పారిస్ నగరాలకు నిరంతారంగా ప్రయాణిస్తాయని పేర్కొంది. ఇందుకోసం 12 ఎయిర్ బస్ A350-1000 ఫ్లైట్లకు ఆర్డర్ చేసింది. ఈ ఫ్లైట్లలో 40 శాతం ప్రీమియం సీట్లు ఉంటాయని పేర్కొంది.