నకిలీకి చెక్​: టాబ్లెట్లకూ క్యూఆర్​ కోడ్​

By udayam on October 3rd / 11:26 am IST

మార్కెట్లో నకిలీ మందుల బెడదను అరికట్టేందుకు కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. బహిరంగ మార్కెట్లో దొరికే ప్రతీ టాబ్లెట్​ పైనా క్యూ ఆర్​ కోడ్​ను ముద్రించాలని భావిస్తోంది. ఈ క్యూ ఆర్​ కోడ్​ స్కాన్​ చేయడం ద్వారా వినియోగదారులు అవి అసలైనవా? నకిలీవా? అన్న విషయాన్ని గుర్తించగలరని భావిస్తోంది. మందులు ఉండే స్ట్రిప్​, జార్​, ట్యూబ్​ లపై ఈ క్యూఆర్​ కోడ్​ను ముద్రిస్తారు. ముందుగా రూ.100 కంటే తక్కువ రేటున్న టాబ్లెట్లకు ఆపై అన్ని మందులకూ ఈ క్యూఆర్​ కోడ్​ అందుబాటులోకి రానుంది.

ట్యాగ్స్​