క్వాల్​కమ్​ను దాటేసిన మీడియాటెక్​

By udayam on March 30th / 9:31 am IST

ప్రీమియం స్మార్ట్​ఫోన్లలో వాడే చిప్​సెట్​ క్వాల్​కమ్​ మొబైల్​ మార్కెట్లో తన అగ్రస్థానాన్ని కోల్పోయింది. చిన్న, మధ్య స్థాయి ధరల ఫోన్లలో వాడే మీడియా టెక్​ చిప్​ సెట్​ ఆ స్థానాన్ని అందుకుందని ఓమ్​డియా అనే సంస్థ తన నివేదికలో వెల్లడించింది. చైనాకు చెందిన షియామీతోనూ, కొరియా సంస్థ సామ్​సంగ్​తోనూ మీడియాటెక్​ పార్టనర్​షిప్​ పెట్టుకోవడం కూడా ఈ సంస్థ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించింది. 2020లో ఏకంగా 351.8 మిలియన్ల స్మార్ట్​ఫోన్​ చిప్​సెట్లను ఈ సంస్థ అమ్మింది.

ట్యాగ్స్​