క్వీన్ ఎలిజబెత్-2 : శాశ్వత నిద్రలోకి ‘మహారాణి’

By udayam on September 20th / 5:40 am IST

బ్రిటన్​ మహారాణి ఎలిజబెత్​–2 అంత్యక్రియలు సోమవారం అర్ధరాత్రికి ముగిసాయి. సుమారు 2000ల మంది దేశ, విదేశీ అతిథులు హాజరైన ఈ అంతిమయాత్రలో పలు రాజ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సెయింట్ జార్జి చర్చిలోని చాపెల్‌ రాయల్ వాల్ట్‌లోకి రాణి శవపేటికను దించారు. అక్కడే ఆమె శాశ్వత నిద్ర చేయనున్నారు. ఆమెను ఖననం చేసే సమయంలో దేశవ్యాప్తంగా బ్రిటన్​ మొత్తం రెండు నిమిషాల పాటు నిశ్శబ్దం పాటించి రాణికి ఘన వీడ్కోలు తెలిపింది. ఏడు దశాబ్దాల పాటు బ్రిటన్​కు మహారాణిగా ఉన్న ఆమె ఈనెల 8న వృద్ధాప్యంతో కన్నుమూశారు.

ట్యాగ్స్​