టి20 లకు అశ్విన్​ ఇప్పటికీ సరిపోతాడు – కైఫ్​

By udayam on November 20th / 1:05 pm IST

ఆఫ్​ స్పిన్నర్​ రవిచంద్రన్​ అశ్విన్​ ఆస్ట్రేలియాతో జరిగే టి–20 సిరీస్​కు సైతం సరిగ్గా సరిపోతాడని ఢిల్లీ కేపిటల్స్​ అసిస్టెంట్​ కోచ్​ మహమ్మద్​ కైఫ్​ వెల్లడించాడు.

అతడిని కేవలం టెస్ట్​ మ్యాచ్​ల కోసం స్పెషలిస్ట్​ స్పిన్నర్​గా చూడాల్సిన అవసరం లేదని అతడు టి–20 ల కోసం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడని కైఫ్​ అభిప్రాయపడ్డాడు.

అశ్విన్​ చివరి సారిగా భారత్​ తరపును 2017లో టి–20 ఆడాడు. అప్పుడే చివరిసారిగా వన్డే కూడా ఆడిన అతడు అప్పటి నుంచి కేవలం టెస్ట్​ సిరీస్​లకు మాత్రమే జట్టుకు సేవలందిస్తున్నాడు. అయితే ఐపిఎల్​ లో మాత్రం ఈ ఏడాది ఢిల్లీ కేపిటల్స్​ తరపున ఆడిన అతడు 13 వికెట్లు తీసి సిరీస్​లో రాణించాడు.