టాలీవుడ్ అగ్రనటులు రానా దగ్గుబాటి, వెంకటేష్ దగ్గుబాటిలు కలిసి నటిస్తున్న క్రైమ్ డ్రామా సిరీస్ ‘రానా నాయుడు’ షూటింగ్ పూర్తయింది. సుపర్న్ వర్మ నిర్మిస్తున్న ఈ నెట్ఫ్లిక్స్ సిరీస్ అమెరికాలో విడుదలై హిట్ కొట్టిన ‘రే డొనొవన్’కు ఇండియన్ రీమేక్. మీర్జాపూర్, ఇన్సైడ్ ఎడ్జ్ వంటి సిరీస్లను డైరెక్ట్ చేసిన కరన్ అన్షుమన్ ఈ సిరీస్కు దర్శకత్వం వహించారు. సుపర్న్ వర్ణ గతంలో ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 కు ప్రొడ్యూస్ చేశారు.