దేశంలోనే దిగ్గజ వ్యాపార వేత్త, డీమార్ట్ అధినేత రాధాకృష్ణ దామానీ ఆస్తులు ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 23 శాతం కుప్పకూలాయి. ప్రస్తుతం దామానీ ఆస్తులు రూ.1,55.503.17 లక్షల కోట్లుగా ఉన్నట్లు ట్రెండ్‌లైన్ డేటా సంస్థ పేర్కొంది. గతేడాది డిసెంబర్ 31 నాటికి అతడి ఆస్తి రూ.2,02,248.66 కోట్లుగా ఉండగా అందులో 23 శాతం ఈ ఏడాది తొలి త్రైమాసికంలో కోల్పోయారు. గత ఏడేళ్ళలో ఆయన ఆస్తి 14,512.07 శాతం మేర పెరిగినట్లు ఈ సంస్థ అంచనా వేసింది.