‘రాధేశ్యామ్’​కు రూ.400 కోట్ల డీల్​!

By udayam on June 8th / 4:10 am IST

పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్​ సరికొత్త చిత్రం ’రాధే శ్యామ్​’కు ఓటిటి దిగ్గజం అమెజాన్​ ప్రైమ్​ భారీ ఆఫర్​ చేసినట్లు చిత్ర నిర్మాతల్లో ఒకరైన టి–సిరీస్​ వెల్లడించింది. అయితే దీనిపై ఇంకా చర్చలు జరుపుతున్నామన ఆ సంస్థ మొత్తం సినిమాపై హక్కుల్ని అమెజాన్​ అడుగుతున్నట్లు సమాచారం. ఇంకా చిన్న పార్ట్​ షూటింగ్​ పెండింగ్​ ఉన్న ఈ చిత్రానికి ఇప్పటికే రూ.300 కోట్లకు పైగా బడ్జెట్​ అయినట్లు సమాచారం. ఇప్పట్లో ధియేటర్లు ఓపెన్​ అవుతాయో లేదో తెలియని పరిస్థితుల్లో ఈ చిత్రానికి ఇంత భారీ ఆఫర్​ దక్కడం విశేషం.

ట్యాగ్స్​