విక్రమ్ మూవీతో లోకేష్ కనగరాజ్ పాన్ ఇండియా డైరెక్టర్ల లిస్ట్ లోకి చేరిపోయాడు. దీంతో లోకేష్ కనకగరాజ్ యూనివర్శ్ లోకి టాప్ హీరోల ఎంట్రీ కొనసాగుతోంది. ఇటీవలే నటుడు విజయ్ కూడా తన తర్వాతి చిత్రాన్ని ఈ సిరీస్ లో భాగంగానే తెరకెక్కిస్తుంటే.. తాజాగా నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ లారెన్స్ కూడా ఈ యూనివర్శ్ లోకి అడుగుపెట్టాడు! లోకేష్–కార్తీ కాంబోలో వచ్చే ఏడాది తెరకెక్కనున్న ‘ఖైదీ–2’ లో విలన్ గా లారెన్స్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కథా చర్చలు పూర్తి కాగా లారెన్స్ తన పాత్రకు ఓకే చెప్పేశాడని సమాచారం.