ప్రధానికి రఘురామ లేఖ: నన్ను కొట్టడం జగన్​ లైవ్​ లో చూశారు

By udayam on December 15th / 11:00 am IST

వైకాపా రెబల్​ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సిఎం జగన్​ పై తీవ్ర ఆరోపణలు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. సీఐడీ పోలీసులు తనను అరెస్ట్ చేసిన సమయంలో ఆ శాఖ ఏడీజీ సునీల్ కుమార్ కొట్టారని, కస్టోడియల్ టార్చర్ చేశారని లేఖలో పేర్కొన్న ఆయన.. ఈ తతంగం మొత్తాన్ని సిఎం జగన్​ వీడియో ద్వారా లైవ్​ లో చూశారంటూ రాసుకొచ్చారు. విచారణ అధికారులను పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ ఇంకా పిలవలేదని, ఎవరు కొట్టారో ఇంకా విచారణే జరపలేదని అన్నారు. ఈ అంశంపై త్వరగా విచారణ జరిపించాలని కోరారు.

ట్యాగ్స్​