విశాఖ–తునిల మధ్య తీరం దాటనున్న అసాని!

By udayam on May 9th / 2:40 pm IST

తీవ్ర తుపానుగా మారిన అసానీ ప్రభావం ఆంధ్రప్రదేశ్​పై తీవ్రంగా ఉండనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం విశాఖకు 450 కి.మీ.ల దూరంలో గంటకు 20 కి.మీ.ల వేగంతో ఈ తుపాను ప్రయాణిస్తోందని తెలిపింది. దీని ప్రభావం విశాఖపట్నం, తునిల మధ్య తీవ్రంగా ఉండనుందని, రేపట్నుంచి ఈ ప్రాంతాల్లో వర్షాలు మొదలై 11వ తేదీ వరకూ కురుస్తాయని పేర్కొంది. విశాఖ వద్ద ప్రస్తుతం 60 కి.మీ.ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఉత్తరాంధ్రతో పాటు తూర్పుగోదావరి జిల్లాపైనా తీవ్ర ప్రభావం చూపనుంది.

ట్యాగ్స్​