ఐపిఎల్‌లో ఫామ్‌లోకి వస్తున్న కోల్‌కతా నైట్ రైడర్స్‌కు గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ అజింక్యా రహానే గాయం కారణంగా ఈ సీజన్ నుంచి తప్పుకున్నాడు. గత శనివారం హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తుండగా రహానే గాయపడ్డాడు. టోర్నీ నుంచి బయటకు వెళ్ళిన రహానే 4 వారాల పాటు బెంగళూరులోని ఎన్‌సిసిలో వైద్యం, శిక్షణ తీసుకోనున్నాడని బిసిసిఐ వెల్లడించింది. ఐపిఎల్ అనంతరం ఇంగ్లాండ్‌లో జరిగే టెస్ట్ సరీస్కూ అతడు అందుబాటులో ఉండడని సమాచారం.