అంపైర్​తో రాహుల్​ చాహర్​ వాగ్వాదం

By udayam on November 25th / 10:18 am IST

ఐపిఎల్​లో ముంబై జట్టు తరపున ఆడుతున్న స్పిన్నర్​ రాహుల్​ చాహర్​ సౌత్​ ఆఫ్రికా ఎ జట్టుతో జరుగుతున్న మ్యాచ్​లో అంపైర్​తో గొడవకు దిగాడు. భారత ఎ జట్టు తరుపున ఆడుతున్న అతడు బౌలింగ్​లో తేలిపోయాడు. ఆ క్రమంలో అతడు చేసిన ఎల్బీడబ్ల్యూ అప్పీల్​ను అంపైర్​ నాటౌట్​గా ప్రకటించడంతో కళ్ళద్దాలను నేలకేసి కొట్టి నిమిషం పాటు అతడితో వాగ్వాదానికి దిగాడు. ఈ మ్యాచ్​లో కేవలం ఒకే వికెట్​ తీసిన చాహర్​ 125 పరుగులు సమర్పించుకున్నాడు.

ట్యాగ్స్​