ద్రవిడ్​: బిజెపి సదస్సుకు నేనెందుకు వెళ్తా

By udayam on May 10th / 12:57 pm IST

హిమాచల్​ ప్రదేశ్​లో ఈనెల 12–15 తేదీల్లో జరగనున్న బిజెపి యువమోర్చా సదస్సుకు తాను వెళ్తున్నానంటూ జాతీయ మీడియాలో వచ్చిన వార్తలపై భారత క్రికెట్​ హెడ్​ కోచ్​ రాహుల్​ ద్రవిడ్​ స్పందించాడు. అవన్నీ తప్పుడు వార్తలని కొట్టిపారేశాడు. తాను ఎలాంటి రాజకీయ సమావేశాలకు హాజరుకావడం లేదని స్పష్టం చేశాడు. ఇదే విషయాన్ని బిసిసిఐ సైతం నిర్ధారించింది. అంతకు ముందు ధర్మశాల ఎమ్మెల్యే విశాల్​ నెహ్రియా ఈ సమావేశానికి ద్రవిడ్​ వస్తున్నాడని ప్రకటించడంతో ఆ వార్త వైరల్​ అయింది.

ట్యాగ్స్​