బిజెపి మీటింగ్​కు రాహుల్​ ద్రవిడ్​?

By udayam on May 10th / 6:54 am IST

భారత సీనియర్​ క్రికెట్​ జట్టు హెడ్​ కోచ్​, మాజీ క్రికెటర్​ రాహుల్​ ద్రవిడ్​ భారతీయ జనతా పార్టీ యువ మోర్చా సదస్సుకు హాజరు కానున్నాడు. ఈనెల 12 నుంచి 15 వరకూ హిమాచల్​ ప్రదేశ్​లో జరిగే ఈ సమావేశానికి ద్రవిడ్​ రానున్నట్లు ధర్మశాల ఎమ్మెల్యే విశాల్​ నెహ్రియా వెల్లడించాడు. ఇదే సమావేశానికి బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, కేంద్ర మంత్రులు సైతం రానున్నారు. రాజకీయాలకు దూరంగా ఉండే ద్రవిడ్​ బిజెపి మీటింగ్​కు వస్తున్నాడన్న వార్త ఇంటర్నెట్​ను షేక్​ చేస్తోంది.

ట్యాగ్స్​