టీమిండియా కోచ్​గా రాహుల్​ ద్రవిడ్​!

By udayam on October 16th / 6:47 am IST

భారత జట్టు కోచ్​గా రాహుల్​ ద్రవిడ్​ ఎంపికయ్యే అవకాశాలు 100 శాతం ఉన్నట్లు రిపోర్టులు వస్తున్నాయి. ఈ నెలలో జరగనున్న టి20 వరల్డ్​ కప్​తో కోచ్​ పదవికి గుడ్​ బై చెప్పేయనున్న రవిశాస్త్రి స్థానాన్ని ద్రవిడ్​తో భర్తీ చేయాలని బిసిసిఐ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి ద్రవిడ్​ కూడా అంగీకరించాడని త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. బ్యాటింగ్​ కోచ్​గా విక్రమ్​ కొనసాగుతాడని తెలుస్తోంది. గత నెలలో భారత బి జట్టు శ్రీలంకలో పర్యటించినప్పుడు కోచ్​గా ద్రవిడ్​నే ఉన్న సంగతి తెలిసిందే.