రాహుల్ గాంధీపై బాంబు దాడి చేస్తామంటూ లేఖ

By udayam on November 18th / 10:21 am IST

కాంగ్రెస్​ కు పునర్వైభవం తేవడానికి దేశవ్యాప్తంగా భారత్​ జోడో యాత్ర చేస్తున్న రాహుల్​ గాంధీకి బెదిరింపు లేఖ అందింది. ఈరోజు మధ్యప్రదేశ్​ లోని ఇండోర్​ కు చేరుకున్న ఈ యాత్రలో రాహుల్​ గాంధీపై బాంబు దాడి చేస్తాంటూ జుని ప్రాంతంలోని ఓ స్వీటు షాపు వద్ద లేఖను దండుగులు విడిచిపెట్టి వెళ్ళారు. రాహుల్ యాత్ర ఇండోర్ చోరుకోగానే నగరం బాంబు దాడులతో దద్దరిల్లిపోతుందని ఆ లేఖలో హెచ్చరించారు. అంతేకాదు, రాహుల్ గాంధీతో పాటు మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ను కూడా హతమార్చుతామంటూ ఆ లేఖలో పేర్కొన్నారు.

ట్యాగ్స్​