విద్యార్ధి కల నెరవేర్చిన రాహుల్​

By udayam on April 6th / 11:22 am IST

కేరళలో పర్యటనలో ఉన్న కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ.. అక్కడి ఓ 9 ఏళ్ళ కుర్రాడిని వెంటపట్టుకుని తన విమానానికి తీసుకెళ్లి దాని గురించి వివరించారు. అంతకుముందు ఆ విద్యార్ధితో మాట్లాడిన రాహుల్​ నువ్వు పెద్దయ్యాక ఏమవుతావని ప్రశ్నించగా.. అతడు తాను పైలట్​ కావాలనుకుంటున్నట్లు చెప్పాడు. దాంతో ఆ మరుసటి రోజు ఆ కుర్రాడిని తన విమానం వద్దకు తీసుకు వెళ్ళి పైలట్​తో పాటు రాహుల్​ కూడా ఆ విమానం ఎలా పనిచేస్తుందో ఆ బాలుడికి వివరించారు. ఈ వీడియో వైరల్​ అవుతోంది.

ట్యాగ్స్​