ఆ గ్రామంపై మాట్లాడరే మోదీజీ?

అరుణాచల్​ ప్రదేశ్​లో చైనా గ్రామం వార్తలపై ప్రధానిపై కాంగ్రెస్​ విమర్శలు

By udayam on January 19th / 7:04 am IST

అరుణాచల్​ ప్రదేశ్​లో చైనా ఓ గ్రామాన్ని నిర్మించిందని వస్తున్న వార్తలపై కాంగ్రెస్​ పార్టీ లీడర్​ రాహుల్​ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తూ ట్వీట్​ చేశారు.

ఈ దేశాన్ని ఎవరి ముందూ మోకరిల్లనివ్వం అంటూ మీరు చేసిన వాగ్ధానం గుర్తుందా అంటూ ఆయన ట్విట్టర్​లో మోదీని ప్రశ్నించారు.

కాంగ్రెస్​ పార్టీ లీడర్​ రణదీప్​ సుర్జేవాలా సైతం ప్రధానిపై విమర్శలు ఎక్కుపెట్టారు.

‘‘మోదీ జీ మీ 56 ఇంచుల చెస్ట్​ ఎక్కడుంది” అంటూ ఆయన ట్వీట్ చేశారు.

మరో కాంగ్రెస్​ లీడర్​ పి చిదంబరం సైతం ఈ విషయంపై ప్రభుత్వం తక్షణం స్పందించాలని డిమాండ్​ చేశారు. మీ సొంత పార్టీ ఎంపి తాపిర్​ గావో సైతం చైనా అరుణాచల్​ వద్ద 100 ఇళ్ళతో ఓ గ్రామాన్ని నిర్మించిందని పేర్కొన్నారని దీనిపై ఎందుకు మౌనం వహిస్తున్నారంటూ ప్రశ్నించారు.