తెలంగాణ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి చంచల్ గూడ జైలులో ఉన్న ఎన్ఎస్యూఐ నేతలతో ములాఖత్‌కు అనుమతులు దక్కాయి. ముందు అనుమతులు ఇవ్వని చంచల్‌గూడ పోలీసులు.. అనంతరం రాహుల్, రేవంత్ రెడ్డిలకు మాత్రమే ములాఖత్‌కు అనుమతించారు. ఉస్మానియా యూనివర్శిటీకి రాహుల్ గాంధీని అనుమతించాలంటూ నిరసన తెలిపిన ఎన్ఎస్యూఐ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే.