కాంగ్రెస్ నేత రాహుల్ చేపడుతున్న భారత్ జోడో యాత్ర బుధవారం పంజాబ్‌లో ప్రవేశించనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఆయన అమృతసర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్‌సింగ్ రాజా వారింగ్, ప్రతిపక్ష నేత పర్తాప్ సింగ్ భజ్వా, స్ధానిక ఎంపి గుర్జీత్ సింగ్ ఔజ్లా, ఇతర పార్టీ నేతలు ఉన్నారు. 116వ రోజు హర్యానాలోని అంబాలాలో జోడోయాత్ర ముగిసిందని ఈ సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ నే జైరాం రమేష్ ట్వీట్ చేశారు.