దేశాన్ని 8 ఏళ్ళ పాలించిన నరేంద్ర మోదీ దుష్పరిపాలన ఒక కేస్ స్టడీ లాంటిదని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన విద్యుత్ సంక్షోభంపై మరోసారి ప్రధానిని దుయ్యబట్టారు. ‘విద్యుత్, నిరుద్యోగం, రైతు, ద్రవ్యోల్బణ సంక్షోభాలను తెచ్చి పెట్టిన మోదీ పాలన ఒక కేస్ స్టడీ లాంటిది. అత్యంత వేగంగా ఎదుగుతున్న ఓ పెద్ద దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను ఎలా దెబ్బతీయాలో ఆయన చేసి చూపించారు’ అని ఆయన ట్వీట్లో విమర్శించారు.