76 శాతం పెరిగిన రైల్వేల ఆదాయం

By udayam on December 5th / 6:03 am IST

దేశీయ రైళ్ళు లాభాల పరుగులు తీశాయి. గతేడాదితో పోల్చితే ఏకంగా ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 8 నెలల్లో ప్రయాణికుల ద్వారా ఆదాయం 76 శాతం పెరిగింది. గత నవంబరు ఆఖరు వరకు భారతీయ రైల్వే ప్రయాణీకులకు అందించిన వివిధ రకాల సేవల నుంచి మొత్తం రూ.43,324 కోట్లు ఆర్జించింది. గతేడాది ఇదే కాలానికి కేవలం రూ.24,631 కోట్లు రెవెన్యూ వచ్చింది. గతేడాది రిజర్వుడు సెగ్మెంట్‌లో రూ.22,904 కోట్లు రాగా ఈ ఏడాది రూ.34,303 కోట్లు వచ్చాయి.

ట్యాగ్స్​