రైళ్లలో వృద్ధులకు ఇచ్చే రాయితీలను పునరుద్ధరించే అవకాశం లేదని కేంద్రం స్పష్టం చేసింది. రైల్వేలో ఫించన్లు, ఉద్యోగులు జీతాల భారం అధికంగా ఉందని.. ఈ నేపథ్యంలో సీనియర్ సిటిజన్లకు రాయితీను పునరుద్ధరించడం ఇప్పట్లో సాధ్యం కాదని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. కరోనా సమయంలో రద్దు చేసిన సీనియర్ సిటిజిన్ల రాయితీని తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారని మహారాష్ట్ర ఎంపి నవనీత్ రాణా లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు వైష్ణవ్ సమాధానమిచ్చారు.