గుట్కా క్లీనింగ్​కు రూ.12 వేల కోట్లు

By udayam on October 12th / 10:19 am IST

రైలు ప్రయాణికులు చేసే గుట్కా మరకల్ని తొలగించడానికి రైల్వే శాఖకు ఏటా రూ.12 వేల కోట్లు ఖర్చు అవుతోంది. కొవిడ్​ 19 తర్వాత పరిసరాల పరిశుభ్రతపై అవగాహన మరింత పెరిగిన రోజుల్లోనూ రైల్వేను ఈ గుట్కా మరకలు వదలక పోవడం గమనార్హం. దీంతో రైల్వే శాఖ స్టేషన్లలో ఉమ్మి వేయడానికి కియాస్క్​లను ఏర్పాటు చేస్తోంది. దేశవ్యాప్తంగా 42 స్టేషన్లలో ఈ కియాస్క్​లను ఏర్పాటు చేయనుంది. ఒక్కసారి ఈ కియాస్క్​ను వినియోగించడానికి రూ.5 నుంచి రూ.10 వరకూ చెల్లించాల్సి ఉంటుంది.

ట్యాగ్స్​