రైలు ప్రయాణికులకు అలెర్ట్! ఎక్కువ లగేజీతో ప్రయాణించే అలవాటుందా! అయితే మీ చేతి చమురు మరింత వదిలించుకోవడం తప్పకపోవచ్చు. ఇప్పటి వరకూ ఎంత లగేజ్ తెచ్చినా అధిక ఛార్జ్ చేయని రైల్వేస్.. ఇకపై మాత్రం ఆ నిర్ణయంలో మార్పు తీసుకురానుంది. విమానాల్లో ఎలా అయితే అధిక లగేజ్కు అధిక రుసుం వసూలు చేస్తారో.. అచ్చం అలాంటి ఛార్జీలనే రైలు ప్రయాణికులపైనా వేయాలని ఆ శాఖ భావిస్తోంది.