రోజ్ గార్ మేళాలో భాగంగా రైల్వే శాఖ పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇందుకోసం ఉద్యోగాల భర్తీపై టైం టేబుల్ ను ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చిలోగా 35,281 ఉద్యోగాల భర్తీకి రైల్వే బోర్డు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే జారీ చేసిన ప్రకటనలు, నియామక ప్రక్రియ వివిధ దశలలో ఉన్న వాటిని వచ్చే నాలుగు నెలల్లో పూర్తిచేయనున్నట్లు రైల్వే బోర్డు ఈడీ అమితాబ్ శర్మ వెల్లడించారు. వీటిల్లో జూనియర్ అకౌంట్ అసిస్టెంట్స్, గూడ్స్ గార్డ్స్, కమర్షియల్ అప్రెంటీస్, టికెట్ క్లర్క్, సీనియర్ క్లర్క్ కం టైపిస్ట్, టైం కీపర్ ఉద్యోగాలు ఉన్నాయి.