కొద్దిరోజుల క్రితం నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడి ప్రస్తుతం దక్షిణ కోస్తాంద్రపై అల్పపీడనంగా కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది గురువారం నాటికి మరింత బలహీనపడిందని, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని పేర్కొంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురువనున్నట్లు తెలిపింది. ఈ నెలాఖరులోగా ఉత్తర అండమాన్ సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడి బలపడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.