కాకినాడ వద్ద తీరం దాటనున్న అసాని

By udayam on May 11th / 6:06 am IST

అసాని తుపాను దిశను మార్చుకుని ఆంధ్రప్రదేశ్​లోని కాకినాడ వద్ద తీరం దాటనుందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో కాకినాడ జిల్లాలో ఈరోజు ఉదయం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం ఉదయం నాటికి ఈ తుపాను కాకినాడ తీరం దాటుతుందని ఒడిశా స్పెషల్​ రిలీఫ్​ కమిషనర్​ ప్రదీప్​ కుమార్​ జేనా సైతం ప్రకటించారు. ఉత్తర బెంగాల్​ నుంచి ఉత్తర ఆంధ్ర వైపు ఈ తుపాను గమనాన్ని మార్చుకుందని ఆయన ఎఎన్​ఐ వార్తా సంస్థకు తెలిపారు.

ట్యాగ్స్​