నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు చోట్ల ఈరోజు మోస్తరు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ నైరుతి వైపుగా పయనించి నిన్న ఉత్తర శ్రీలంకలో తీరం దాటి ఇది తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది పశ్చిమ నైరుతి తీరం దిశగా పయనించి నేటి ఉదయానికి కొమెరిన్ తీరం దిశగా వస్తుందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురుగా వర్షాలు కురవనున్నాయి. మరోవైపు చలి తీవ్రతా రాష్ట్రంలో తీవ్రంగా పెరిగింది.