సిఎం: హిందుత్వం పేరుతో ప్రజాస్వామ్యం అమ్ముడుపోతోంది

By udayam on June 22nd / 10:56 am IST

దేశంలో హిందుత్వ పేరుతో ప్రజాస్వామ్యం మసకబారుతోందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్​ అన్నారు. మహారాష్ట్రలో శివసేన ఎమ్మెల్యేలు బిజెపి పంచన చేరుతున్నారని, ఉద్దవ్​ ఠాక్రే ప్రభుత్వం కూలిపోతోందన్న వార్తల నేపధ్యంలో గెహ్లాత్​ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని ప్రజలు ఇప్పుడు అర్థం చేసుకోవడం లేదని, తరువాత వారే బాధపడతారని ఆయన అన్నారు. దేశంలో శాంతి భద్రతలు సరిగా లేవు, ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉంది… కానీ బీజేపీ మాత్రం ఎమ్మెల్యేలను కొనే పనిలో ఉందని ఆయన విమర్శించారు.

ట్యాగ్స్​