రాజస్థాన్​ డబుల్​ ధమాకా

By udayam on May 21st / 5:45 am IST

ఐపిఎల్​ ప్లే ఆఫ్స్​ రేసులోకి రాజస్థాన్​ రాయల్స్​ రెండో స్థానంతో దూసుకుపోయింది. నిన్న రాత్రి చెన్నైతో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్​లో 2 బాల్స్​ మిగిలి ఉండగా లక్ష్యాన్ని ఛేధించిన సంజూ సేన 2008 తర్వాత తొలిసారిగా గ్రూప్​ స్టేజ్​లో టాప్​ పొజిషన్​ దక్కించుకుంది. అంతకు ముందు మోయిన్​ ఆలీ 93, ధోనీ 26 పరుగులతో రాణించడంతో చెన్నై 150 పరుగుల మోస్తరు స్కోరు చేసింది. ఆపై రాయల్స్​ జట్టులో జైశ్వాల్​ 59, అశ్విన్​ 40 పరుగులు చేసి రాజస్థాన్​కు విజయాన్ని కట్టబెట్టారు.

ట్యాగ్స్​