స్వామి శ్రద్దానంద్​: రాజీవ్​ హంతకుల్లానే నన్నూ వదిలేయండి

By udayam on November 17th / 5:04 am IST

ఆస్తి కోసం భార్యను హత్య చేసిన కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న స్వామి శ్రద్దానంద్​ అనే వ్యక్తి తననూ రాజీవ్​ గాంధీ హంతకులను జైలు నుంచి విడిచిపెట్టినట్లే వదిలేయాలని సుప్రీం మెట్లెక్కాడు. ‘43 మందిని హత్య చేసిన నిందితులకు.. మధ్యలో పెరోల్​ దొరికింది. 30 ఏళ్ళలో ఎన్నోసార్లు వారు జైలు నుంచి బయటకొచ్చారు. ఇప్పుడు విడుదలయ్యారు. కానీ నేను మాత్రం గత 29 ఏళ్ళుగా జైలులోనే ఒక్కరోజూ పెరోల్​ లేకుండా గడిపాను. వారికి వర్తించిన చట్టాలు నాకెందుకు వర్తించవు. నన్నూ వదిలేయండి’ అంటూ చీఫ్​ జస్టిస్​ డివై.చంద్రచూడ్​, జస్టిస్​ హిమ కోహ్లి, జస్టిస్​ జె.బి.పర్దీవాలా ధర్మాసనం ముందు వాదించుకున్నాడు. అయితే దీనిపై సుప్రీం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

ట్యాగ్స్​