జలాంతర్గామిలో రాజ్​నాథ్​ సింగ్​

By udayam on May 28th / 4:16 am IST

దేశ రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్​ తొలిసారిగా ఓ జలాంతర్గామిలో ప్రయాణించారు. కర్ణాటకలోని కార్వార్​ నౌకాదళ స్థావరం నుంచి కల్వరి క్లాస్​ ఐఎన్​ఎస్​ ఖండేరీలో ఆయన శుక్రవారం సముద్రయానం చేశారు. ఐఎన్​ఎస్​ ఖండేరీలో ప్రయాణించడం అద్భుతంగా ఉందన్న ఆయన థ్రిల్​ వచ్చిందని చెప్పారు. ‘ఈ అత్యాధునిక జలాంతర్గామిలో గంటల తరబడి ఉండడం అద్భుతంగా ఉంది. కల్వరి క్లాస్​ సబ్​మెరైన్​ పోరాట సామర్థ్యాలను దగ్గరుండి చూడడం బాగుంది’ అని ఆయన వెల్లడించారు.

ట్యాగ్స్​