జూన్​ 10న ఎపి, తెలంగాణల్లో రాజ్యసభ ఎన్నికలు

By udayam on May 13th / 6:06 am IST

తెలుగు రాష్ట్రాల్లో 6 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్​ను విడుదల చేసింది. తెలంగాణలో 2, ఎపిలో 4 రాజ్యసభ స్థానాలకు వచ్చే నెల 10న ఎన్నికలు జరగనుంది. ఇందుకు గానూ మే 24న నోటిఫికేషన్​ను విడుదల చేయనున్నట్లు, మే 31న నామినేషన్ల దాఖలుకు తుది గడువుగా ఇవ్వనున్నట్లు పేర్కొంది. జూన్​ 10న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటలకు పోలింగ్​.. అదే రోజు ఫలితాల వెల్లడి ఉంటుందని తెలిపింది. 10న దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 57 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

ట్యాగ్స్​