ఇన్వెస్టర్​ రాకేష్​ ఝున్​ఝున్​వాలా హఠాన్మరణం

By udayam on August 14th / 5:04 am IST

దేశంలోనే ప్రముఖ ఇన్వెస్టర్​, వ్యాపారవేత్త రాకేష్​ ఝున్​ఝున్​వాలా (62) ఈరోజు గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. భారత స్టాక్​ మార్కెట్​లో బిగ్​బుల్​గా పిలిచే ఆయనను కొంత మంది ఇండియాస్​ వారెన్​ బఫెట్​గానూ పిలుచుకుంటారు. హంగామా మీడియా, ఆప్టెక్ వంటి సంస్థలకు చైర్మన్‌గా… వైస్రాయ్ హోటల్స్, కాంకర్డ్ బయోటెక్, ప్రొవోగ్ ఇండియా, జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్‌కు డైరెక్టర్‌గా ఉన్నారు. ఇటీవలే ఆయన ‘ఆకాశ’ పేరుతో సొంత ఎయిర్​లైన్స్​ను తీసుకొచ్చారు.

ట్యాగ్స్​