డిప్రెషన్​ లో రామ్​ చరణ్​! నిజమెంత??

By udayam on November 18th / 6:44 am IST

ఆర్​ఆర్​ఆర్​ వంటి పాన్​ ఇండియా హిట్​ తో దూసుకుపోతున్న నటుడు రామ్​ చరణ్​ డిప్రెషన్​ లో ఉన్నట్లు కొన్ని ఎంటర్​టైన్​మెంట్​ వెబ్​ సైట్లు వార్తల్ని రాస్తున్నాయి. ఓ వైపు రామ్​ చరణ్​, శంకర్​ మూవీ షూటింగ్​ ఆగిపోవడం, ఈ సినిమాలో నటించడానికి నటుడు మోహన్​ లాల్​ కూడా వెనక్కు తగ్గడం, మరో వైపు గౌతమ్​ తిన్ననూరి తనకు చెప్పిన కథను వేరే హీరోతో సినిమాగా తీయనుండడం అతడిని బాధిస్తున్నాయని ఆ వెబ్​ సైట్లు పేర్కొన్నాయి. అయితే ఎంతటి సమస్య వచ్చినా అతడిని చూసుకునే తండ్రి మెగాస్టార్​.. బాబాయ్​ పవర్​ స్టార్లు ఉండగా.. అతడు ఇలా డిప్రెషన్​ లోకి ఎందుకు వెళ్తాడు అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. సినిమా షూటింగులు ఆలస్యమవడం అతడికి కొత్తేమీ కాదని కూడా ట్వీట్లలో రాస్తున్నారు.

ట్యాగ్స్​