రామ్ చరణ్, శంకర్ కాంబోలో వస్తున్న మరో పాన్ ఇండియా మూవీ #RC15 కొత్త షెడ్యూల్ ను కాస్త ఆలస్యంగా మొదలవ్వనుంది. ఈ కొత్త షెడ్యూల్ కర్నూలు కొండారెడ్డి బురుజు సెంటర్లో జరగాల్సి ఉండగా.. షూటింగ్ పర్మిషన్స్ విషయంలో కాస్త ఆలస్యం జరగడంతో కొత్త ఏడాది తొలి వారంలో మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవలే ఈ మూవీ న్యూజిలాండ్ షెడ్యూల్ లో సాంగ్స్ చిత్రీకరణ పార్ట్స్ కంప్లీట్ చేసుకొచ్చింది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.