రామ్​ చరణ్​ ఇంట మెగా క్రిస్మస్​ వేడుకలు

By udayam on December 21st / 8:03 am IST

మెగా పవర్ స్టార్ రాంచరణ్ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా తన కుటుంబ సభ్యులందరికీ స్పెషల్ పార్టీ ఇచ్చారు. మంగళవారం సాయంత్ర చరణ్ నివాసంలో జరిగిన ఈ వేడుకల్లో అల్లు అర్జున్- స్నేహా దంపతులు, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నిహారిక, శిరీష్, సుస్మితా, శ్రీజ పాల్గొన్నారు. వీరంతా ఎంతో ఉత్సాహంగా పార్టీలో పాల్గొన్నారు. సీక్రెట్ శాంతా గేమ్ లో భాగంగా ఒకరికి ఒకరు పరస్పరం బహుమతులు ఇచ్చుకున్నారు. ఈ వేడుకలను సంబంధించిన ఫోటోలను ఉపసాన తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.

ట్యాగ్స్​