ప్రొడక్షన్ హౌస్‌ను రూ.56 లక్షల మేర చీటింగ్ చేసారన్న ఆరోపణలతో ఫిలింమేకర్ రామ్ గోపాల్ వర్మపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. శేఖర ఆర్ట్ క్రియేషన్స్‌కు చెందిన కొప్పాడ శేఖర్ రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. దిశా అనే చిత్రాన్ని నిర్మించడానికి వర్మ తన వద్ద ఆ మొత్తాన్ని అప్పుగా తీసుకున్నాడని.. సినిమా రిలీజ్‌కు ముందే చెల్లిస్తానని చెప్పి ఇప్పటికీ ఒక్క రూపాయి చెల్లించలేదని అతడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.