జెర్సీ డైరెక్టర్​తో రామ్​చరణ్​

By udayam on October 15th / 11:38 am IST

మెగా పవర్​ స్టార్​ రామ్​చరణ్​ తన తర్వాతి చిత్రాన్ని కూడా లైన్​లో పెట్టేశాడు. ఇప్పటికే ఆచార్య, ఆర్​ఆర్​ఆర్​ సినిమాల షూటింగ్​ను దాదాపుగా కంప్లీట్​ చేసేసిన అతడు శంకర్​ దర్శకత్వంలో పాన్​ ఇండియా మూవీలో నటించాల్సి ఉంది. ఆ చిత్రం అయిన తర్వాత జెర్సీ వంటి కల్ట్​ క్లాసిక్​ను తెరకెక్కించిన గౌతమ్​ తిన్ననూరి డైరెక్షన్​లో తన 16వ చిత్రాన్ని మొదలుపెట్టనున్నాడు.

ట్యాగ్స్​