రమీజ్​ కు చెంపపెట్టు.. పాక్​ క్రికెట్​ ఛైర్మన్​ పదవిని తప్పించిన ప్రధాని.. బోర్డ్​ లో అఫ్రిది

By udayam on December 22nd / 6:59 am IST

పొద్దున్న లేచి బిసిసిఐ పై నోరు పారేసుకునే పాక్​ క్రికెట్​ బోర్డ్​ ఛైర్మన్​ రమీజ్​ రాజా తన పదవిని కోల్పోయాడు. సొంత దేశం క్రికెట్​ పెర్ఫార్మెన్స్​ ను గాలికొదిలేసి.. భారత్​ పై ప్రగల్భాలు పలికే ఇతడిని.. ఆ దేశ ప్రధాని తప్పించారు. ఇటీవల పాక్​ జట్టు ఏ ఒక్క అంతర్జాతీయ టోర్నీని నెగ్గకపోయినా క్షమించిన ఆ దేశ ప్రజలు.. ఇటీవల ఇంగ్లాండ్​ చేతిలో స్వదేశంలో టెస్ట్​ వైట్​ వాష్​ కు గురవ్వడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.దీనిని గమనించిన పాక్​ ప్రధాని రమీజ్​ రాజాను బోర్డ్​ ఛైర్మన్​ పదవి నుంచి దించేశాడు. ఆ పదవిని పాత ఛైర్మన్​ నజమ్​ సేథికి అప్పగించి.. బోర్డ్​ లో షాహీద్​ అఫ్రిదికి చోటు కల్పించారు.

ట్యాగ్స్​