భారత్ లో అత్యంత చెత్త విమానయాన అనుభవం కావాలంటే ఇండిగో ఎయిర్ లైన్స్ ను ఎంపిక చేసుకోవాలంటూ ఫైర్ అయ్యాడు నటుడు దగ్గుబాటి రానా. ఆదివారం ఉదయం కుటుంబంతో కలిసి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళేందుకు బయల్దేరిన అతడికి షెడ్యూల్డ్ ఫ్లైట్ కాకుండా మరో ఫ్లైట్ ను ఇవ్వడంతో పాటు లగేజీ వెంట రాకపోవడంతో విమానయాన సిబ్బందిపై ఫైర్ అయ్యాడు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేసిన అతడు విమానాలు ఎప్పడొస్తాయ్? ఎప్పుడు వెళ్తాయ్? మిస్సయిన లగేజీ ఎలా కనుక్కోవాలో వంటి చిన్న చిన్న విషయాలూ సిబ్బందికి తెలియదన్నాడు.