శ్రీలంక నూతన ప్రధానిగా విక్రమ సింఘే

By udayam on May 13th / 5:01 am IST

శ్రీలంకకు కొత్త ప్రధానిగా రణిల్​ విక్రమ సింఘే బాధ్యతలు చేపట్టారు. యునైటెడ్​ నేషనల్​ పార్టీ నేత అయిన ఆయనతో అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ప్రమాణం చేయించారు. మరో వారం రోజుల్లో కొత్త కేబినెట్​ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. విక్రమ సింఘే గతంలోనూ 4 సార్లు ఈ ద్వీప దేశానికి ప్రధానిగా పనిచేశారు. దేశాన్ని ఆర్ధిక కష్టాల నుంచి తప్పించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న అధ్యక్షుడు.. ప్రధాని పదవి కోసం విక్రమ సింఘేను ఎన్నుకున్నారు.

ట్యాగ్స్​